ys jagan release ysr sunna vaddi scheme funds amalapuram
Telecast Date: 11-08-2023 Category: Political Publisher:  SevenTV

 

మహిళలను మోసం చేసిన చరిత్ర నారా వారిదేనని ఏపీ సీఎం జగన్‌ మండిపడ్డారు. 2016లో సున్నా వడ్డీ పథకాన్ని చంద్రబాబు రద్దు చేశారని, వడ్డీని మాఫీ చేయకుండా మోసం చేశారని ఆరోపించారు. చంద్రబాబు అరాచకాలను తలుచుకుంటే బాధనిపిస్తుందని అన్నారు.

కోనసీమ జిల్లా అమలాపురం మండలల జనుపల్లిలో ఈరోజు జగన్ పర్యటించారు. నాలుగో విడత వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద పొదుపు మహిళల ఖాతాల్లో వడ్డీ డబ్బులను జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోటీ 5 లక్షల మంది మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి కలుగుతుందని చెప్పారు. రూ.1,353.76 కోట్ల వడ్డీని రిలీజ్ చేశారు. ఇప్పటిదాకా 4,969.05 కోట్లను మహిళల ఖాతాలకు బదిలీ చేసినట్లు చెప్పారు. 

గత ప్రభుత్వంలో అక్కాచెల్లెమ్మలను మోసం చేశారని, బాబు హయాంలో రూ.14 వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టారని జగన్ ఆరోపించారు. మహిళలను గత ప్రభుత్వం రోడ్డున పడేసిందని, నాటి బకాయిలను తాము చెల్లించామని చెప్పారు.

 

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment
  • Comment
  • Preview
Loading