wineshops bandh in telangana for three days
Telecast Date: 04-11-2023 Category: Entertainment Publisher:  SevenTV

 

 

తెలంగాణలోని మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల

పాటు వైన్ షాపులు మూతపడనున్నాయి. వీటితోపాటు బార్లు కూడా తెరుచుకోవు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ నెలాఖరున వరుసగా మూడు రోజులు మద్యం అమ్మకాలు బంద్ పెట్టనున్నారు. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఎక్సైజ్ శాఖ అధికారులకు సూచనలు చేసింది.

ఈ నెల 28 నుంచి 30 వరకు వైన్స్ బంద్ పెట్టాలని, ఈ విషయంపై వైన్స్, బార్ల యజమానులకు ముందస్తుగా సమాచారం అందించాలని సూచించింది. సీఈసీ ఆదేశాల మేరకు ఈ నెలాఖరున మద్యం విక్రయాలు నిలిపివేసేలా చర్యలు చేపట్టినట్లు తెలంగాణ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ పేర్కొన్నారు. ఈమేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, వైన్ షాపుల యజమానులు, బార్ల యజమానులను అలర్ట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading