we will reduce liquor rate if tdp come to power says chandrababu
Telecast Date: 01-08-2023 Category: Political Publisher:  SevenTV

 

నంద్యాల జిల్లా నందికొట్కూరు బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడుతూ మందుబాబులకు మాంచి కిక్ ఇచ్చే విషయాన్ని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వస్తే మద్యం ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చారు. నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేస్తామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాసిరకం మద్యాన్ని విక్రయిస్తున్నారని విమర్శించారు. బూమ్ బూమ్, స్పెషల్ స్టేటస్, బ్రిటీష్ ఎంపైర్, బ్లాక్ బస్టర్ వంటి విచిత్రమైన బ్రాండ్లను అమ్ముతున్నారని దుయ్యబట్టారు. ఈ నాసి రకం మద్యాన్ని తాగి ఎంతో మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో 6 నెలలు ఆగితే మీ బతుకులను బాగు చేస్తానని చెప్పారు.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading