
వామికా గబ్బి .. ఇప్పుడు ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై చూసినా ఆమె సందడి కనిపిస్తూనే ఉంటుంది. వెబ్ సిరీస్ లను ఫాలో అయ్యేవారికి ఆమెను గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన పని లేదు. ఆమె కోసం ఆ వెబ్ సిరీస్ లను ఫాలో అయ్యేవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఆమెలో ప్రత్యేకమైన ఆకర్షణ ఆమె కళ్లు .. అవి చెప్పే సంగతులు .. కబుర్లు అన్నీ ఇన్నీ కావు.
ఆ కళ్లు చేసే విన్యాసాలను చూడటం కోసమే కుర్రాళ్లంతా ఉత్సాహాన్ని చూపుతుంటారు. యూత్ తన నుంచి ఆశిస్తున్నవి అందించినప్పుడే తాను ఎక్కువ కాలం నిలబడతాననే విషయం వామికా గబ్బీకి తెలుసు. అందువల్లనే ఆమె ఆ తరహా పాత్రలను ఎంచుకుంటూ వెళుతోంది. తెలుగులో సుధీర్ బాబు జోడీగా 'భలేమంచి రోజు' సినిమా చేసిందిగానీ, అప్పటికి ఆమె అంత పాప్యులర్ కాదు గనుక జనాలకి గుర్తులేదు.
|