vangaveeti radha key meeting with followers
Telecast Date: 10-08-2023 Category: Political Publisher:  SevenTV

 

ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో వంగవీటి రాధా మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ అవుతున్నారు. అయితే, వచ్చే ఎన్నికల్లో ఆయన ఏ పార్టీ తరపున పోటీ చేయబోతున్నారే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో, ఆయన తన ముఖ్య అనుచరులతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత ఆయన ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారనే విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సమావేశానంతరం ఆయన తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తారని సమాచారం.ప్రస్తుతం రాధా టీడీపీలో ఉన్నప్పటికీ యాక్టివ్ గా లేరు. విజయవాడ సెంట్రల్ సీటును రాధా అడిగినట్టు... అయితే ఆ స్థానంలో బొండా ఉమా ఉండటంతో రాధా వినతిని పార్టీ అగ్ర నాయకత్వం తిరస్కరించినట్టు తెలుస్తోంది. వేరే నియోజకవర్గం టికెట్ ను రాధాకు హైకమాండ్ సూచించినట్టు తెలుస్తోంది. 

గతంలో వైసీపీలో ఉన్నప్పుడు కూడా సెంట్రల్ టికెట్ ను రాధా కోరారు. ఆ స్థానం టికెట్ ను జగన్ ఇవ్వకపోవడంతో ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చారు. ఇంకోవైపు జనసేనలో చేరాలని రాధాకు సన్నిహితులు సూచిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు ఇటీవల ఓ కార్యక్రమంలో కొడాలి నానిని రాధా కలిశారు. దీంతో, ఆయన మళ్లీ వైసీపీలోకి వెళ్లవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ ప్రచారాలన్నింటి నేపథ్యంలో, ఈనాటి సమావేశంలో రాధా కీలక నిర్ణయం తసుకునే అవకాశం ఉందని చెపుతున్నారు. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading