tomato price in hyderabad coming down
Telecast Date: 08-08-2023 Category: Lifestyle Publisher:  SevenTV

 

 

పెరిగిన టమాటా ధరలతో బెంబేలెత్తిన సామాన్యులకు ఇది ఊరటనిచ్చే విషయమే. మార్కెట్లోకి టమాటాల రాక మళ్లీ పెరుగుతుండడంతో ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. హైదరాబాద్‌కు నిన్నమొన్నటి వరకు 850 క్వింటాళ్ల టమాటాలు రాగా నిన్న 2,450 క్వింటాళ్లు వచ్చాయి. దీంతో ధరలు తగ్గుముఖం పట్టాయి.


దీనికితోడు హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున టమాటా వస్తోంది. రైతు బజార్‌లో ప్రస్తుతం కిలో టమాటా ధర రూ. 63గా ఉండగా బయట మార్కెట్లో మాత్రం రూ. 120 వరకు ఉంటోంది. ఈ నెలాఖరుకు రూ. 50 దిగువకు తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading