tollywood actress pragathi second marriage
Telecast Date: 28-10-2023 Category: Entertainment Publisher:  SevenTV

 

 

టాలీవుడ్ క్యారెక్టర్ నటి ప్రగతికి మంచి గుర్తింపు ఉంది. గొప్ప హీరోయిన్ కావాలన్న ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రగతి... చివరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయింది. చిన్న వయసులోనే ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రగతి... ఆ తర్వాత భర్తతో గొడవల కారణంగా విడాకులు తీసుకుంది. ఇద్దరు పిల్లలతో సింగిల్ మదర్ గా జీవితాన్ని గడుపుతోంది. తెలిసీ తెలియని వయసులో పెళ్లి చేసుకుని పెద్ద తప్పు చేశానని ఆమె పలు ఇంటర్వ్యూలలో చెప్పిన సంగతి తెలిసిందే. 

మరోవైపు ఆమె రెండో వివాహం చేసుకోబోతోందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ లో పలు చిత్రాలను నిర్మించిన ఒక స్టార్ ప్రొడ్యూసర్ ను ఆమె పెళ్లాడబోతోందని ఫిలింనగర్ టాక్. సదరు నిర్మాతే ప్రగతి వద్ద పెళ్లి ప్రపోజల్ తెచ్చినట్టు సమాచారం. ప్రగతి వయసు 47 ఏళ్లు. 21 ఏళ్ల వయసులోనే భర్తతో ఆమె విడిపోయింది. అప్పటి నుంచి ఆమె పెళ్లి చేసుకోలేదు.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading