sirisha alias barrelakka filed nomination from kollapur constituency in telangana
Telecast Date: 09-11-2023 Category: Entertainment Publisher:  SevenTV

 

 

"హాయ్ ఫ్రెండ్స్.. బర్లు కాయనికి వచ్చిన ఫ్రెండ్స్.. ఎంత చదివిన కానీ డిగ్రీలు డిగ్రీలు పట్టాలొస్తున్నాయి గానీ.. జాబులు మాత్రం వస్తలేవ్వు.. నోటిఫికేషన్ వెయ్యరు ఏం వెయ్యరు.. అందుకే మా అమ్మను అడిగి.. నాలుగు బర్రెలు కొన్నా.." అంటూ ఓ అమ్మాయి చెప్పే వీడియో.. అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది గుర్తుందా. బర్రెలక్కగా తెగ ఫేమస్ అయిపోయిన ఈ యువతి ఇప్పడు తెలంగాణలోని ప్రధాన పార్టీలకు సవాల్ విసురుతోంది. నిరుద్యోగ యువతిగా ఇన్‌స్టా గ్రాంలో ఓ చిన్న సెటైరికల్ వీడియోతో ప్రభుత్వంపై తనకున్న అసహనాన్ని వ్యక్తం చేసిన శిరీష అలియాస్ బర్రెలక్క.. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల బరిలో దిగుతోంది. మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన శిరీష.. అదే నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసింది.

తెలంగాణ నిరుద్యోగినిగా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసినట్టు బర్రెలక్క తెలిపింది. అయితే.. తాను అన్ని పార్టీల అభ్యర్థులలాగా ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయలేకపోవచ్చని.. డబ్బు పంచలేకపోవచ్చని తెలిపింది. కానీ ప్రజలు ఏది మంచి ఏది చెడు ఆలోచించాలని... తన ప్రజల సపోర్ట్ ఉంటుందని శిరీష విజ్ఞప్తి చేసింది.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading