shankar multi starrer movie
Telecast Date: 15-11-2023 Category: Entertainment Publisher:  SevenTV

 

 

సూర్య - కార్తి సోదరులు ఇద్దరూ కూడా తమిళనాట స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. తెలుగులోను ఈ ఇద్దరికీ మంచి మార్కెట్ ఉంది. ఈ ఇద్దరూ కలిసి నటిస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇద్దరికీ కూడా ఈ విషయంపై ఇంటర్వ్యూలలో ప్రశ్నలు ఎదురయ్యాయి. సరైన కథ దొరికితే చేస్తామని చెబుతూ వచ్చారు. 

ఇప్పుడు అలాంటి ఒక కథను శంకర్ టీమ్ రెడీ చేస్తున్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. సూర్య - కార్తి కాంబినేషన్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. అందువలన ఈ కాంబినేషన్ ను సెట్ చేసుకుని, అందుకు తగిన కథను శంకర్ రెడీ చేయిస్తున్నాడని అంటున్నారు. ఆ దిశగా గట్టి కసరత్తు జరుగుతోందని చెబుతున్నారు. 

ఇటు సూర్య .. అటు కార్తి ఇమేజ్ కి తగినట్టుగా ఆ పాత్రలను డిజైన్ చేస్తున్నారని అంటున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మించనున్నట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతం 'ఇండియన్ 2' .. 'గేమ్ చేంజర్' సినిమాలతో బిజీగా ఉన్న శంకర్, ఆ తరువాత చేయనున్న సినిమా ఇదేనని అంటున్నారు.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading