shakeela in telugu bigg boss 7
Telecast Date: 28-08-2023 Category: Entertainment Publisher:  SevenTV

 

 

ఎంతో ప్రేక్షకాదరణ పొందిన బిగ్ బాస్ 7 రియాల్టీ షోకు సమయం దగ్గర పడుతోంది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్లు కూడా ఖరారయ్యారు. సెప్టెంబర్ 3 నుంచి స్టార్ మా ఛానల్ లో ఈ సీజన్ బిగ్ బాస్ ప్రసారం కానుంది. మరోవైపు కంటెస్టెంట్ల పేర్లను అధికారికంగా ప్రకటించనప్పటికీ... కొందరి పేర్లు మాత్రం బయటకు వస్తున్నాయి. తాజాగా మరో పేరు బయటకు వచ్చింది. ప్రముఖ సినీ నటి షకీలా ఈ సీజన్ లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. శృంగార తారగా షకీల ఒకప్పుడు వెలుగు వెలిగింది. మలయాళంలో తెరకెక్కిన ఆమె చిత్రాలు అనేక భాషల్లోకి డబ్ అయ్యేవి. ఆ తర్వాత ఆమె అలాంటి సినిమాలను మానేసి, మంచి క్యారెక్టర్ పాత్రలను పోషిస్తూ తన కెరీర్ ను కొససాగిస్తోంది. మరోవైపు, ఈసారి కూడా ఈ షోకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading