second flight under operation ajay reaches india on saturday
Telecast Date: 14-10-2023 Category: Political Publisher:  SevenTV

 

 

 

ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ఉద్దేశించిన ఆపరేషన్ అజయ్ దిగ్విజయంగా కొనసాగుతోంది. నేడు ఉదయం మరో విమానం 235 మంది భారతీయులతో ఢిల్లీకి చేరుకుంది. భారత ప్రభుత్వం సొంత ఖర్చులతో ఈ చార్టెడ్ విమానాలను ఏర్పాటు చేసింది. శుక్రవారం తొలి విమానం భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. తొలి విడతలో 212 మంది సురక్షితంగా భారత్‌కు చేరుకున్నారు. ఈ విమానాల్లో భారత్ రావాలనుకునే వారు ముందుగా తన పేరును రిజిస్టర్ చేసుకోవాలి. ముందుగా రిజిస్టర్ చేసుకున్న వారికే ప్రయాణం కల్పించేలా భారత్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఆధారంగా ఈ ఫ్లైట్స్ నిర్వహిస్తోంది. 

కాగా, ఆదివారం కూడా ఈ సర్వీసు అందుబాటులో ఉంటుందని కేంద్రం తెలిపింది. తమను సురక్షితంగా తరలిస్తున్న భారత్‌కు ఎన్నారైలు ధన్యవాదాలు తెలిపారు. ఇజ్రాయెల్‌లో సుమారు 18 వేల మంది భారతీయులు ఉన్నారు. వీరిలో అధికశాతం మంది కేర్‌గివర్స్‌గా, ఐటీ రంగ నిపుణులుగా ఉన్నారు. కాగా, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో ఇప్పటివరకూ 1300 మంది ఇజ్రాయెలీలు చనిపోగా మరో 1500 మంది హమాస్ మిలిటెంట్లు మృతి చెందారు.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading