sathyabhama movie update
Telecast Date: 31-08-2023 Category: Entertainment Publisher:  SevenTV

 

 

అశోక్ గల్లా ఆ మధ్య తన సొంత బ్యానర్లో 'హీరో' అనే సినిమాను చేశాడు. నిధి అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమా, ఆశించిన స్థాయిలో ఆడలేదు. అశోక్ ఫస్టు సినిమా అలా నిరాశ పరిచింది. అయితే ఇప్పుడు అతను మరో కథను రెడీ చేసుకుని రంగంలోకి దిగాడు .. ఆ సినిమా పేరే 'సత్యభామ'.

 

ఈ సినిమాతో హీరోయిన్ గా ఒక కొత్త అమ్మాయి పరిచయమవుతోంది. ఆ బ్యూటీ పేరే 'మానస వారణాసి'. ఈ సుందరి కోలీవుడ్ నుంచో .. మల్లూ ఉడ్ నుంచో దిగిపోయిందనుకుంటే పొరపాటే. తను అచ్చతెలుగు హైదరాబాద్ అమ్మాయి .. అందాల పోటీల్లో అనేక బహుమతులను సొంతం చేసుకుంది. 



'సత్యభామ'గా టైటిల్ రోల్ ను ఈ సినిమాలో పోషిస్తోంది. సోమినేని బాలకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. గతంలో కార్తికేయతో 'గుణ 369' సినిమా చేసిన అర్జున్ జంధ్యాల ఈ సినిమాకి దర్శకుడు. భీమ్స్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. మరి రెండో సినిమాలో అశోక్ ఎలాంటి విన్యాసాలు చేస్తాడో చూడాలి.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading