rules ranjan movie date confusion
Telecast Date: 12-08-2023 Category: Entertainment Publisher:  SevenTV

 

రెండో సినిమా ఎస్ఆర్ కళ్యాణ మండపంతో సూపర్ హిట్ అందుకుని వరస అవకాశాలు పట్టేసి బిజీ హీరోగా మారిపోయిన కిరణ్ అబ్బవరం బ్యానర్ల మోజులో పడిపోయి కథా కథనాలను లైట్ తీసుకోవడంతో గట్టి ఎదురు దెబ్బలే తగిలాయి. వినరో భాగ్యము విష్ణుకథ ఏదో డీసెంట్ సక్సెస్ అయ్యిందని ఆనందించిన సమయంలో అవసరం లేని హీరోయిజంని నమ్ముకుని చేసిన మీటర్ దారుణంగా దెబ్బ కొట్టేసరికి కుర్రాడికి తత్వం బోధపడింది. మాస్ ని పూర్తిగా టార్గెట్ చేయడానికి ఇంకా చాలా టైం ఉందని గుర్తించి తనకు సూటయ్యే సబ్జెక్టుల కోసం ఎదురు చూస్తున్నాడు.


ఇదిలా ఉండగా ఇతని కొత్త సినిమా రూల్స్ రంజన్ విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే రిలీజ్ డేట్ దొరక్క నిర్మాతలు కిందా మీద పడుతున్నారు. నేహా శెట్టి వయ్యారంగా నర్తించిన చూసేయ్ చూసేయ్ పాట చార్ట్ బస్టర్ అయ్యాక దీని మీద బజ్ వచ్చింది. అమాంతం ఓపెనింగ్ తెచ్చేంత రేంజ్ కాదు కానీ జనం దృష్టిలో అయితే పడింది. అయితే వచ్చే నెల సరైన తేదీ కోసం టీమ్ చేస్తున్న కసరత్తు ఒక కొలిక్కి తేలేకపోతున్నారట. సెప్టెంబర్ 1 విజయ్ దేవరకొండ సమంతాల ఖుషితో క్లాష్ కావడం ఎంత మాత్రం సేఫ్ కాదనే విషయం ఎవరిని అడిగినా చెబుతారు.


ఆపై 7న షారుఖ్ ఖాన్ జవాన్ భారీ ఎత్తున దిగుతున్నాడు. అదే రోజు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిని ప్లాన్ చేస్తోంది యువి సంస్థ. ఇంకొద్ది రోజుల్లో అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సుహాస్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అయినా సరే ఇదొక్కటే బెటర్ స్లాట్. ఎందుకంటే 15న రామ్ స్కందతో పాటు లారెన్స్ చంద్రముఖి 2, విశాల్ మార్క్ ఆంటోనీ ఉన్నాయి. థియేటర్ల సమస్య వస్తుంది. పోనీ 21న వద్దామంటే జస్ట్ వారం గ్యాప్ లో డైనోసార్ ప్రభాస్ సలార్ తో దిగుతాడు. అలాంటప్పుడు రూల్స్ రంజాన్ కి పాజిటివ్ టాక్ వచ్చినా లాభముండదు. చివరికి ఏం డిసైడ్ చేస్తాడో చూడాలి. 

 

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading