
వన్డే వరల్డ్ కప్ 2023తో తొలి సెమీఫైనల్స్ టీమిండియా - న్యూజీలాండ్ ల మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచాడు. మరో ఆలోచనల లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మరోవైపు తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే టీమిండియా బరిలోకి దిగుతోంది. ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ... ఇది గుడ్ పిచ్ అని చెప్పాడు. పిచ్ బ్యాటింగ్ కు అనుకకూలంగా ఉంటుందనే ఉద్దేశంతోనే టాస్ గెలిచాక బ్యాటింగ్ ఎంచుకున్నానని తెలిపాడు. గొప్ప జట్లలో న్యూజిలాండ్ ఒకటని, ఈ మ్యాచ్ రసవత్తరంగా జరుగుతుందని తెలిపాడు. ఈరోజు ఎవరు బాగా ఆడితే విజయం వారిదేనని చెప్పాడు. తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతున్నామని తెలిపాడు.
|