rcb franchise files petition against rajinikanth starred jailer
Telecast Date: 29-08-2023 Category: Entertainment Publisher:  SevenTV

 

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్ బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. కొన్నేళ్లుగా హిట్లు కరవైన రజనీకాంత్ ను మళ్లీ హిట్ బాట పట్టించిన చిత్రం జైలర్. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు.

 

అయితే ఈ సినిమాపై ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సినిమాలో ఓ పాత్రధారి ఆర్సీబీ జెర్సీ వేసుకుని హీరో కోడలిని ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడతాడు. తమ జెర్సీ వేసుకున్న వ్యక్తితో అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయించారంటూ ఆర్సీబీ యాజమాన్యం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఆ సన్నివేశాన్ని తొలగించాలని కోరింది. ఈ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం... జైలర్ సినిమా నుంచి సదరు సన్నివేశాన్ని తొలగించాలని చిత్రబృందాన్ని ఆదేశించింది.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading