rare and costliest dog in hyderabad event
Telecast Date: 17-12-2023 Category: Entertainment Publisher:  SevenTV

 

 

 

ఇంట్లో ముద్దుగా పెంచుకునే శునకం ఖరీదు వేలల్లో ఉంటుంది.. విదేశాలకు చెందిన బ్రీడ్ అయితే లక్షలు వెచ్చించాల్సిందే. వేలు, లక్షలు మాత్రమే కాదు, కోట్లు విలువ చేసే శునకాలు ఉంటాయంటే నమ్మశక్యం కాదు. అయితే, అత్యంత అరుదైన కాకసియన్ షెఫర్డ్ జాతికి చెందిన ఓ కుక్క ఖరీదు రూ.20 కోట్లని ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సతీశ్ చెబుతున్నారు. బెంగళూరుకు చెందిన సతీశ్ శుక్రవారం హైదరాబాద్ కు వచ్చారు. నగరంలో శనివారం జరిగే ఓ ఈవెంట్ లో తన శునకంతో పార్టిసిపేట్ చేశారు. ఈ కుక్కను రష్యా నుంచి కొనుగోలు చేశానని, ఇందుకు రూ. 20 కోట్లు వెచ్చించానని చెప్పారు.

కాకసియన్ షెఫర్డ్ జాతికి చెందిన ఈ శునకానికి కాడాబామ్ హైడర్ గా సతీశ్ నామకరణం చేశారు. ఈవెంట్ లో పాల్గొనే ముందు హెల్త్ చెకప్ కోసం మియాపూర్ లోని పెట్ క్లినిక్ కు తీసుకొచ్చారు. ఈ అరుదైన శునకం రాక గురించి ముందే సమాచారం ఉండడంతో పెట్ క్లినిక్ కు డాగ్ లవర్స్ పోటెత్తారు. ఈ శునకంతో సెల్ఫీల కోసం ఎగబడ్డారు. కాగా, కాడాబామ్ హైడర్ వయసు మూడేళ్లని సతీశ్ చెప్పారు. దీనిని పోషించడానికి లక్షల్లో ఖర్చవుతుందని, రోజుకు మూడు కిలోల చికెన్ తింటుందని వివరించారు. హైడర్ పలు సినిమాల్లో నటించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో జరిగిన షోలలో పాల్గొందని సతీశ్ తెలిపారు.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading