ram in trivikram movie
Telecast Date: 18-01-2024 Category: Entertainment Publisher:  SevenTV

 

రామ్ కొంతకాలంగా వరుస ఫ్లాపులను ఎదుర్కుంటూ వస్తున్నాడు. బోయపాటితో ఆయన చేసిన 'స్కంద' సినిమాపై భారీ అంచనాలు ఉండేవి. ఆయున అభిమానులంతా ఆ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని భావించారు. కానీ ఆ అంచనాలకు చాలా దూరంలోనే ఆ సినిమా ఆగిపోయింది. దాంతో ఆయన పూరి దర్శకత్వంలో 'ఇస్మార్ట్ శంకర్ 2' చేస్తున్నాడు. 

ఈ సినిమా తరువాత ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నట్టుగా ఒక బలమైన టాక్ వినిపిస్తోంది. నిజానికి త్రివిక్రమ్ అటు బన్నీతో ఒక సినిమా .. వెంకీ - నాని కాంబినేషన్లో ఒక సినిమా చేయవలసి ఉంది. ఈ రెండు సినిమాలలో ఏదో ఒకటి సెట్స్ పైకి వెళుతుందని అనుకున్నారు. కానీ 'పుష్ప 2' ఇంకా పూర్తి కాలేదు. వెంకీ - నాని డేట్స్ సర్దుబాటు కుదరడం లేదట. 

అందువలన త్రివిక్రమ్ కూడా రామ్ ప్రాజెక్టును పట్టాలెక్కించాలనే ఆలోచనతో ఉన్నాడని అంటున్నారు. ప్రస్తుతం పూరి దర్శకత్వంలో రామ్ చేస్తున్న సినిమా ఫిబ్రవరితో పూర్తవుతుంది. ఆ తరువాత రామ్ చేసే సినిమా త్రివిక్రమ్ తోనే ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఆషిక రంగనాథ్ ఉండే అవకాశాలు ఎక్కువనే టాక్ కూడా వినిపిస్తోంది మరి. 

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading