railway services take a hit as 26 trains delayed due to dense fog in delhi
Telecast Date: 02-01-2024 Category: Lifestyle Publisher:  SevenTV

 

ఉత్తర భారతదేశాన్ని పొగమంచు కమ్మేయడంతో ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పొగమంచు ప్రభావం 26 రైళ్లపై పడిందని, అవన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. న్యూ ఇయర్ తొలి రోజైన నిన్న కూడా ఈ పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. డిసెంబరు 31న ఢిల్లీలో విజిబిలిటీ దారుణంగా పడిపోవడంతో 23 రైళ్లు ఆలస్యంగా నడిచాయి. 

పొగమంచు కారణంగా నేడు కొన్ని రైళ్లే ఏకంగా ఆరు గంటలు ఆలస్యంగా నడుస్తున్నట్టు రైల్వే పేర్కొంది. కాగా, ఈ వారమంతా వాతావరణం ఇలానే ఉంటుందని భారత వాతావరణశాఖ తెలిపింది. ఉష్ణోగ్రతలు 10 నుంచి 7 డిగ్రీల మధ్య నమోదవుతాయని పేర్కొంది.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading