
ప్రభాస్ హీరోగా రూపొందిన 'సలార్' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఆ తరువాత సినిమాలుగా 'రాజా డీలక్స్' .. 'ప్రాజెక్టు k' లైన్లో ఉన్నాయి. ఇక 'కన్నప్ప' సినిమాలోను ప్రభాస్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ మరో ప్రాజెక్టును అంగీకరించినట్టుగా తెలుస్తోంది. హను రాఘవపూడి ఒక కథ చెప్పి ప్రభాస్ ను ఒప్పించినట్టుగా సమాచారం. 'సీతారామం' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హను రాఘవపూడి, ఆ తరువాత సినిమాను ప్రభాస్ తోనే ప్లాన్ చేసుకున్నాడని అంటున్నారు. ఈ కథ రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో కొనసాగుతుందని చెబుతున్నారు.
రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యం అనగానే ఇది భారీ బడ్జెట్ చిత్రమనీ, పాన్ ఇండియా కంటెంట్ అనే విషయం అర్థమైపోతూనే ఉంది. బాలీవుడ్ లోని బడా నిర్మాణ సంస్థతో కలిసి యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను నిర్మించనున్నారని అంటున్నారు. 300 కోట్లకి పైగా బడ్జెట్ తో నిర్మితం కానున్న ఈ సినిమాలో కథానాయిక ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
|