osama bin laden letter going viral
Telecast Date: 18-11-2023 Category: Health Publisher:  SevenTV

 

ఇజ్రాయెల్ - హమాస్  యుద్ధ నేపథ్యంలో ఆల్ ఖైదా మాజీ అధినేత ఒసామా బిన్ లాడెన్ రాసిన పాత లేఖ ఒకటి తాజాగా వైరల్ అవుతోంది. ఈ లేఖను కొందరు యూజర్లు తొలుత టిక్ టాక్ లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఆ లేఖ ట్విట్టర్ లో షేర్ అయింది. టిక్ టాక్ లో ఆ లెటర్ కు 2 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. 2002లో అమెరికా ప్రజలను ఉద్దేశించి లాడెన్ ఈ లేఖ రాశారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ అణచివేతను ఆ లేఖలో లాడెన్ ప్రస్తావించాడు. దశాబ్దాలుగా ఇజ్రాయెలీల ఆక్రమణలో పాలస్తీనా ఉందని పేర్కొన్నాడు. 2001 సెప్టెంబర్ 11న అమెరికా దాడి జరిగిన తర్వాతే... దౌర్జన్యం, అణచివేతే అమెరికాపై దాడికి కారణమని అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ గ్రహించేదాకా ఎవరూ కూడా పాలస్తీనా సమస్య గురించి మాట్లాడలేదని చెప్పాడు. 

పాలస్తీనా అనేది ఇస్లామిక్ భూమి అని... ఆ భూమిని తిరిగి ఇచ్చే రోడ్ మ్యాప్ ను తయారు చేయాలని లాడెన్ చెప్పాడు. పాలస్తీనా సంకెళ్లను విచ్చిన్నం చేసేందుకు తాను ప్రయత్నిస్తానని తెలిపాడు. క్రైస్తవుల రక్తంతో అమెరికా తగిన మూల్యం చెల్లించుకుంటుందని చెప్పాడు. 2002లో ఈ లేఖను ది గార్డియన్ తన వెబ్ సైట్ లో పెట్టింది. ఇప్పుడు ఆ లేఖ వైరల్ అవుతుండంతో వెబ్ సైట్ నుంచి తొలగించింది.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading