npdcl cmd annamaneni gopal rao resign
Telecast Date: 08-12-2023 Category: Political Publisher:  SevenTV

 

 

 

తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నత పదవుల్లో ఉన్నవారు వరుసపెట్టి రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) సీఎండీ అన్నమనేని గోపాల్‌రావు చేరారు. ఆయన నిన్న తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఇంధనశాఖ ప్రత్యేక కార్యదర్శికి పంపించారు. 

అనంతరం గోపాల్‌రావు మాట్లాడుతూ.. ఈ సుదీర్ఘ ప్రయాణంలో పదవి తనకు చాలా సంతృప్తినిచ్చిందన్నారు. ఇంతకాలం తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఇటీవల ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, సాంస్కృతిక సలహాదారు రమణాచారి రాజీనామా చేశారు. తాజాగా, గోపాల్‌రావు కూడా తప్పుకున్నారు.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading