netizens fires on bollywood senior actress hema malini
Telecast Date: 11-01-2024 Category: Entertainment Publisher:  SevenTV

 

 

 

అభిమాన సినీతారలు కనిపిస్తే వారితో ఒక సెల్ఫీ తీసుకోవాలని, ఆ ఆనందాన్ని పదిలపరుచుకోవాలని అభిమానులు భావిస్తూ ఉంటారు. అచ్చం అలాగే ఆలోచించిన ఓ అభిమానితో బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలిని అవమానించేలా ప్రవర్తించడంపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. తానేమీ సెల్ఫీలు ఇచ్చేందుకు రాలేదన్న ఆమె సమాధానం విని సెల్ఫీ తీసుకోవాలన్న అభిమాని ముఖం కందిపోయింది.

ప్రముఖ గేయరచయిత గుల్జార్ బయోగ్రఫీ ‘గుల్జార్ ‌సాబ్: హాజర్ రహే మడ్‌కే దేఖిన్’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హేమమాలిని హాజరయ్యారు. ఈ సందర్భంగా సెల్ఫీ అడిగిన అభిమానితో ఆమె ప్రవర్తించిన తీరు నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. ఆనందంగా సెల్ఫీ అడిగిన అభిమానితో ఇలా దురుసగా ప్రవర్తించడం సరికాదని మండిపడుతున్నారు.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment
  • Comment
  • Preview
Loading