nara brahmani tweet
Telecast Date: 18-09-2023 Category: Political Publisher:  SevenTV

 

 

ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందని నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి ఆరోపించారు. కళ్లు ఉండి కూడా ప్రభుత్వ పెద్దలు వాస్తవాలను చూడలేకపోతున్నారని విమర్శించారు. ప్రభుత్వం, సీఐడీ అధికారులు వ్యక్తం చేసిన సందేహాలు, ఆరోపణలను సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్ నివృత్తి చేసేలా ఆదివారం పూర్తి వివరణ ఇచ్చారని బ్రాహ్మణి చెప్పారు. ప్రభుత్వ పెద్దలు మాత్రం కళ్లుండి కూడా చూడలేకపోతున్నారని, వైసీపీ నేతల తీరు అసమర్థులని మండిపడ్డారు. ఈమేరకు సోమవారం నారా బ్రాహ్మణి ఓ ట్వీట్ చేశారు. ప్రభుత్వ సంస్థలతో పాటు మల్టినేషనల్ కంపెనీలనూ వైసీపీ అపహాస్యం చేస్తోందని బ్రాహ్మణి విమర్శించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్టు తీరును బ్రాహ్మణి తీవ్రంగా తప్పుబట్టారు.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading