nandu interview
Telecast Date: 13-12-2023 Category: Entertainment Publisher:  SevenTV

గీతామాధురి భర్త నందు .. ప్రస్తుతం ఒక వైపున సినిమాలు చేస్తూనే, మరో వైపున వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నాడు. 'మాన్షన్ 24' వెబ్ సిరీస్ లో ఒక ముఖ్యమైన పాత్రను పోషించిన ఆయన, రీసెంటుగా వచ్చిన 'వధువు' వెబ్ సిరీస్ లోను ఒక కీలకమైన పాత్రను పోషించాడు. ఈ సిరీస్ కి సంబంధించిన ప్రమోషన్స్ లో ఆయన కనిపిస్తున్నాడు. 


తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నందు మాట్లాడుతూ .. "గీత .. నా తలరాతను మార్చేసింది. ఆమె మంచి హోమ్ మేకర్. నాకు సంబంధించిన అన్ని వ్యవహారాలను దాదాపు ఆమెనే చూసుకుంటుంది. ఇంటికి సంబంధించిన అన్ని విషయాలను తాను చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది. కాకపోతే తన మేకప్ సామాగ్రికి సంబంధించిన విషయంలో తనని కంట్రోల్ చేయడమే చాలా కష్టం" అని అన్నాడు. 


"గీతా .. నేను చాలా ప్రేమగా ఉంటాము. అయితే ప్రొఫెషన్ పరంగా ఎవరి గుర్తింపు వారికి రావాలనే ఉద్దేశంతో, కలిసి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం మానేశాము. అలాగే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కూడా తగ్గిస్తూ వచ్చాము. దాంతో ఈ ఇద్దరూ విడిపోతున్నారు .. అందుకే ఇలా" అంటూ ప్రచారం చేయడం మొదలెట్టారు. నిజానికి మేము చాలా సంతోషంగా ఉన్నాము" అని చెప్పాడు.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading