man found half eaten by zoo tigers in pakistan
Telecast Date: 12-12-2023 Category: Entertainment Publisher:  SevenTV

 

 

 

 

పాకిస్థాన్‌లోని బహవల్‌పూర్‌ ఓ జంతు ప్రదర్శనశాలలో దారుణం జరిగింది.  ఓ పులి బోనులో సగం తిన్న మనిషి శరీరాన్ని గుర్తించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు జూను మూసివేశారు. గత బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రోజువారీ చెకింగ్‌లో భాగంగా జూ సిబ్బంది బుధవారం ఉదయం అన్ని ఎన్‌క్లోజర్లను చెక్ చేస్తుండగా ఓ పులి నోట్లు షూ కనిపించింది. దానిపక్కనే సగం తిన్న మనిషి శరీరాన్ని గుర్తించారు. 

అతడు ఎన్‌క్లోజర్‌లోకి దూకి పులికి ఆహారమై ఉంటాడని, మంగళవారం రాత్రే ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. పులి దాడిచేసినప్పుడు అతడు బతికే ఉండొచ్చని చెప్తున్నారు. బాధితుడిని గుర్తించాల్సి ఉంది. అతడు పులి నోటికి ఎలా చిక్కాడన్న దానిపై దర్యాప్తు జరుగుతోందని, ప్రస్తుతం జూను మూసివేశామని అధికారులు తెలిపారు.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading