
కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరుగా శివకార్తికేయన్ కనిపిస్తాడు. తెలుగులో మన నానీకి ఎలాంటి క్రేజ్ ఉందో, అక్కడ శివకార్తికేయన్ కి అలాంటి ఇమేజ్ ఉంది. ఈ మధ్య కాలంలో శివ కార్తికేయన్ కూడా తన సినిమాలు తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదలయ్యేలా చూసుకుంటున్నాడు. అలా ఆయన ఇక్కడ కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఆయన తమిళంలో చేసిన 'మహావీరన్' .. తెలుగులో 'మహావీరుడు'గా జులై 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదితి శంకర్ ఈ సినిమాలో కథానాయికగా కనిపించింది. అలాంటి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఈ నెల 11వ తేదీన ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా ప్రకటించారు.
ఈ సినిమాలో హీరో ఓ బస్తీ యువకుడు. ప్రభుత్వం కట్టించిన ఒక నాసిరకం అపార్టుమెంటులోకి తన ఫ్యామిలీతో కలిసి వెళతాడు. అక్కడ అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? వాటిని అతను ఎలా అధిగమిస్తాడు? అనేదే కథ. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీతో కూడిన ఈ సినిమా, ఓటీటీ వైపు నుంచి ఏ స్థాయి రెస్పాన్స్ ను రాబడుతుందనేది చూడాలి.
|