london mayor election candidate tarun gulati seeks pawan support in the elections
Telecast Date: 09-11-2023 Category: Political Publisher:  SevenTV

 

 

లండన్ మేయర్ ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగిన ప్రముఖ భారత సంతతి పారిశ్రామికవేత్త తరుణ్ గులాటీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతు కోరారు. ఆయన తాజాగా హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్‌ను కలిశారు. తను పోటీ చేస్తున్న ప్రాంతంలో పవన్ అభిమానులు, జనసైనికులు గణనీయంగా ఉన్నారని తెలిపారు.

కాగా, గులాటీ అభ్యర్థనపై జనసేనాని సానుకూలంగా స్పందించారు. భారత సంతతి నేత లండన్ ఎన్నికల్లో పోటీ చేయడం హర్షణీయమని పేర్కొన్నారు. తన అభిమానులు, జనసైనికులు, తెలుగువారితో పాటూ భారతీయులంతా తరుణ్ గులాటీకి ఓటు వేయాలని ఈ సందర్భంగా పవన్ పిలుపునిచ్చారు.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading