lakhs of crores of debt have been cancelled in modi government
Telecast Date: 08-08-2023 Category: Political Publisher:  SevenTV

 

గడచిన తొమ్మిది ఏళ్ళల్లో నరేంద్రమోడీ ప్రభుత్వం బడా పారిశ్రామకవేత్తలకు లక్షల కోట్ల రూపాయల అప్పులను మాఫీచేసింది. మామూలు జనాలు వెయ్యిరూపాయలు అప్పున్నా వదిలిపెట్టని బ్యాంకులు పెద్ద పారిశ్రామికవేత్తలకు మాత్రం వేల కోట్ల రూపాయల అప్పులను రద్దుచేసేస్తోంది. గడచిన తొమ్మిదేళ్ళల్లో నరేంద్రమోడీ ప్రభుత్వం రద్దుచేసిన అప్పులు రూ. 14.56 లక్షల కోట్లు. మొండిబాకీల పేరుతో అంటే వసూలు చేయటం సాధ్యంకాదని బ్యాంకులు చేతులు ఎత్తేసిన పేరుతో లక్షల కోట్ల రూపాయలను రద్దుచేశాయి.

ఇన్ని లక్షల కోట్ల రూపాయలను బ్యాంకులు రైతులకో లేకపోతే మధ్య తరగతి జనాలకో అప్పులుగా ఇవ్వలేదు. తీసుకున్న అప్పులను రద్దుచేయటంలో ప్రభుత్వ బ్యాంకులే కాదు ప్రైవేటు అప్పులు కూడా పోటీలు పడుతున్నాయి. బడా పారిశ్రామికవేత్తలు ఏదో పేరుతో వేలకోట్ల రూపాయల ప్రజాధనాన్ని బ్యాంకుల నుండి అప్పుల రూపంలో తీసుకుంటున్నారు. కొంతకాలం అప్పులను, వడ్డీలను కట్టిన తర్వాత తీసుకున్న అప్పులను కట్టకుండా ఆపేస్తారు.యాపారంలో నష్టాలు వచ్చిన కారణంగా అసలు, వడ్డీలను కట్టలేకపోతున్నట్లు బ్యాంకులకు చెబుతారు. అంతే ఇక బ్యాంకులు కూడా ఆ అప్పులను  పట్టించుకోవు. కొంత కాలమైన తర్వాత తాము తీసుకున్న అప్పులను రద్దుచేయాలని పారిశ్రామికవేత్తలు బ్యాంకులకు లేఖలు రాస్తాయి. బ్యాంకు పాలకవర్గం సమావేశంలో ఇలాంటి రిక్వెస్టులను పరిశీలించి తీసుకున్న అప్పులను మాఫీచేయటానికి నిర్ణయిస్తాయి. ఇలాంటి మాఫీ అయిన అప్పులే రు. 14.56 లక్షల కోట్లు.

ఇన్ని లక్షల కోట్లరూపాయలను బ్యాంకులు తాము సంపాదించిన లాభాల్లో నుండి మినహాయించుకోవటంలేదు. మొత్తం భారాన్ని జనాలపైనే మోపుతోంది. రానిబాకీల ద్వారా తమపైన పడిన భారాన్ని బ్యాంకులు క్రెడిట్, డెబిట్ కార్డుల సర్వీసు ఛార్జీలు, పాస్ బుక్, ఖాతాల మైన్ టెనెన్స్ ఛార్జీలని అదన ఇదని రకరకాల చార్జీల పేరుతో బాదేస్తున్నాయి. నీరవ్ మోడీ, మొహిల్ చోక్సీ, విజయామాల్య లాంటి వాళ్ళు వేలాది కోట్ల రూపాయలు లోన్లు తీసుకుని ఎగ్గొట్టి పారిపోయారు. రాయపాటి సాంబశివరావు, సుజనా చౌదరి, రఘురామకృష్ణంరాజు, సీఎం రమేష్, గరికపాటి మోహనరావు లాంటి వాళ్ళు హ్యాపీగా దేశంలోనే ఉన్నారు.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading