kohli questions wife anushka over not clapping for him
Telecast Date: 13-11-2023 Category: Entertainment Publisher:  SevenTV

 

 

 

ఈ వరల్డ్ కప్‌లో సరికొత్త రికార్డులతో సృష్టించిన కింగ్ కోహ్లీ నిన్న నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలర్‌గాను తన సత్తా చాటాడు. ఓ వికెట్ తీసి అభిమానులను మురిపించాడు. భారత్‌కు అప్పటికే సెమీస్ బెర్త్ ఖరారైపోవడంతో నిన్నటి మ్యాచ్‌ ఉత్సాహభరితంగా సాగింది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీకి బౌలింగ్ ఛాన్సు ఇవ్వాలంటూ స్టాండ్స్‌ నుంచి అభిమానులు గట్టిగా అరిచారు. దీంతో, కెప్టెన్ రోహిత్ శర్మ విరాట్‌కు బంతి అందించాడు. 

23వ ఓవర్‌లో బౌలింగ్‌కు దిగిన విరాట్ తొలి ఓవర్‌లో ఏడు పరుగులు ఇచ్చాడు. అయితే, గ్యాలరీలో ఉన్న విరాట్ అర్ధాంగి అనుష్క శర్మ చిరునవ్వులు చిందించడం మినహా చప్పట్లు కొట్టలేదు. ఇది గమనించిన విరాట్ సరదా స్పందించాడు. ‘చప్పట్లు కొట్టకపోతే ఎలా అనుష్కా?’ అంటూ  సైగలు చేశాడు. 

కాగా, 25వ ఓవర్‌లో మూడో బంతికి స్టాట్ ఎడ్వర్డ్స్ వికెట్ తీసిన కోహ్లీ అభిమానులను ఉర్రూతలూగించాడు. స్టేడియంలో సంబరం అంబరాన్నంటేలా చేశాడు. కోహ్లీ వికెట్ తీయడం చూసి అనుష్క కూడా మురిసిపోయింది. సీటులోంచి లెచి మరీ చప్పట్లు కొడుతూ అభినందనలు తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. 

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading