keedaa cola to release on november 3rd
Telecast Date: 16-09-2023 Category: Entertainment Publisher:  SevenTV

 

 

పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది చిత్రాలకు దర్శకత్వం వహించిన తరుణ్ భాస్కర్ ఆ తర్వాత నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. హీరో, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించే ప్రయత్నం చేశాడు. కొంత గ్యాప్ తర్వాత తను మళ్లీ మెగా ఫోన్ పట్టి తీస్తున్న చిత్రం ‘కీడా కోలా’. ఇందులో తను కీలక పాత్రలో నటిస్తున్నాడు. హీరో రానా దగ్గుబాటి ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.  వేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. వైవిధ్యమైన పోస్టర్లతో ఎనిమిది పాత్రలను పరిచయం చేసిన చిత్ర బృందం టీజర్‌‌తో కూడా ఆసక్తిని పెంచింది.

 

తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. నవంబర్ 3న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు తెలిపింది. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ పోస్టర్‌‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్, చైతన్య రావు సహా ఇతర నటులంతా సీరియస్ లుక్‌లో కనిపించారు. సినిమాలో తరుణ్ భాస్కర్ లోకల్ డాన్‌గా  కీలకపాత్ర పోషించాడు. 

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading