jawan box office collections on day 2
Telecast Date: 09-09-2023 Category: Entertainment Publisher:  SevenTV

 

ఈ ఏడాది ఆరంభంలో ఇప్పటికే ‘పఠాన్’ చిత్రంతో తన సత్తా చూపెట్టిన బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ ఇప్పుడు ‘జవాన్’ సినిమాతో కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తున్నారు. దక్షిణాది దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. విడుదలైన తొలి రోజే  ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 130 కోట్ల  వసూళ్లు సాధించి ‘పఠాన్’ పేరుమీద ఉన్న రూ. 106 కోట్ల రికార్డును చెరిపేసింది. రెండో రోజు (శుక్రవారం) కూడా ‘జవాన్’ ప్రభంజనం కొనసాగింది. దెబ్బకు రెండు రోజుల్లోనే ఈ సినిమా 200 కోట్ల క్లబ్ లోకి చేరింది. 



ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు రెండో రోజు 'జవాన్' భారత్‌ లో అన్ని భాషల్లో కలిపి రూ. 53 కోట్లు రాబట్టింది . హిందీ బెల్ట్‌లో మొత్తం 42.51 శాతం ఆక్యుపెన్సీని సాధించింది. కాగా, ఈ చిత్రం దాదాపు 305 కోట్ల  ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. నార్త్ ఇండియాలో రూ. 135 కోట్లు, సౌత్ ఇండియాలో రూ. 65 కోట్లు, ఓవర్సీస్ లో మరో 105 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 175 కోట్ల నెట్ వసూళ్లు చేయాల్సి ఉంది. జవాన్ దూకుడు చూస్తుంటే తొలివారంలోనే రూ. 500 కోట్లు రాబట్టి లాభాల్లోకి వచ్చే అవకాశం ఉంది.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading