jagan to go to vijayawada today
Telecast Date: 04-08-2023 Category: Political Publisher:  SevenTV

 

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు విజయవాడలో పర్యటించనున్నారు. ఉదయం 10.20 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో జగన్ బయల్దేరుతారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ కు చేరుకుంటారు. అక్కడ జరిగే ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్ (ఆప్కాబ్) వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. కార్యక్రమం ముగిసిన తర్వాత తాడేపల్లికి తిరుగుపయనమవుతారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కీలక కూడళ్ల వద్ద ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.

మరోవైపు ఈరోజు కూనవరం వరద ప్రభావిత ప్రాంతాల్లో జరగాల్సిన సీఎం పర్యటన రద్దయినట్టు సమాచారం. రానున్న సోమవారం, మంగళవారాల్లో ఈ ప్రాంతాల్లో జగన్ పర్యటించనున్నట్టు తెలుస్తోంది. ఈ పర్యటనకు సంబంధించి ఈ సాయంత్రం సీఎం కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading