imd issues rain alert for telugu states
Telecast Date: 24-08-2023 Category: Lifestyle Publisher:  SevenTV

 

 

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోని పలు ప్రాంతాలకు ఎల్లో, గ్రీన్ అలర్ట్ జారీ చేసింది. రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, పలుచోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని చెప్పింది.

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ఓ ప్రకటనలో తెలిపింది. తెలంగాణలోని మేడ్చల్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, నల్లగొండ, రంగారెడ్డి, సూర్యాపేట, హైదరాబాద్, జనగామ, భువనగిరి జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading