ileana welcomes baby boy
Telecast Date: 06-08-2023 Category: Entertainment Publisher:  SevenTV

 

నటి ఇలియానా తల్లి అయ్యారు. ఆగస్టు 1న మగ బిడ్డకు జన్మనిచ్చినట్టు ఆమె ఇన్‌స్టాలో తెలియజేశారు. కుమారుడికి కోవా ఫీనిక్స్ డోలన్ అని నామకరణం చేసిన నటి, ఆ చిన్నారి చిత్రాన్ని కూడా షేర్ చేస్తూ అభిమానులతో తన ఆనందాన్ని పంచుకున్నారు. ‘‘మా డార్లింగ్‌ను ఈ ప్రపంచంలోకి ఆహ్వానిస్తున్నందుకు ఎంత సంతోషంగా ఉన్నామో మాటల్లో చెప్పలేం. గుండె సంబరంతో నిండిపోయింది’’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం అభిమానులు, స్నేహితులు, ఇలియానాకు పెద్దఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఇలియానా తన ప్రెగ్నెన్సీ విషయాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించారు. ఆ తరువాత జులైలో తన ప్రియుడి ఫొటోలను కూడా షేర్ చేశారు. ‘దేవదాస్‌’ మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఇలియానా ఆ తరువాత పలు హిట్ చిత్రాల్లో నటించి టాప్ స్థానానికి చేరుకున్నారు. ఆపై బాలీవుడ్‌లోనూ నటించి ప్రేక్షకులను మెప్పించారు.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading