high court shocks ap gov on r5 zone houses in amaravati
Telecast Date: 03-08-2023 Category: Political Publisher:  SevenTV

 

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్‌ ఇచ్చింది. సుప్రీం కోర్టు వరకు వెళ్లి గెలిచి మరీ అమరావతి ఆర్‌ 5 జోన్‌ లో పేదవారికి ఇళ్లు కట్టిస్తున్నామని గొప్పగా చెప్పుకున్న ప్రభుత్వానికి హైకోర్టు షాక్‌ ఇచ్చింది. ఆర్‌ 5 జోన్‌ లో ఇళ్ల నిర్మాణం పై హైకోర్టు స్టే ఆర్డర్‌ ఇచ్చింది. కడుతున్న ఇళ్లను వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆర్‌ 5 జోన్‌ ఏర్పాటు అనేది చట్ట విరుద్దమనే అంశం పై ఇటు హైకోర్టులోనూ, అటు సుప్రీం కోర్టులోనూ కొన్ని కేసులు నడుస్తున్నాయి.

ఇప్పటి వరకు రాజధాని అంశం గురించి హైకోర్టు ఇచ్చిన తీర్పు పై సుప్రీం కోర్టు ఇంకా స్టే ఇవ్వలేదు. కానీ దాని ప్రకారం మాస్టర్‌ ప్లాన్‌ లో ఎలాంటి మార్పులు చేయకూడదు. కానీ మాస్టర్‌ ప్లాన్‌ లో మార్పులు చేసేసి ఆర్‌ 5 జోన్‌ ఏర్పాటు చేసి..పేదల పేరుతో ఎక్కడెక్కడో ఉన్న ఓటు బ్యాంక్‌ లకు సెంటు భూములు పంపిణీ చేయడంతో పాఉట శంకుస్థాపన కూడా చేసేసారు.

ఇక్కడ సుప్రీం కోర్టు కూడా ఇంటి స్థలాలు పంపిణీ చేయవచ్చు కానీ..అది సాధ్యం పడదు కాబట్టి చివరి తీర్పు తరువాతనే అలాంటి అవకాశం ఉంటుంది. ఆ మేరకే ఇళ్ల పట్టాలపై ప్రింట్‌ చేయాలని చెప్పింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం తీర్పును సైతం పక్కన పెట్టింది. ఆర్ 5 జోన్‌లో ఉన్న భూమిపై ధర్డ్ పార్టీకి భూమిహక్కులు బదలాయింపు కావు.

రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా వైసీపీ గవర్నమెంట్‌ సొంతంగా ఇళ్లు కట్టించలేదు కానీ..కేవలం అమరావతిలోనే కేంద్రం నుంచి నిధులు రాకపోయినప్పటికీ..ఇళ్లు కట్టిస్తానని ఎందుకు హడావిడి చేస్తుందని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీనిని అడ్డం పెట్టుకొని ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవాలని ప్రయత్నిస్తుందని టీడీపీ నేతలు కొందరు ఆరోపిస్తున్నారు.

ఇప్పుడు ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే విధించింది. వచ్చే డిసెంబర్ లో రాజధాని కేసులపై విచారణ జరుగుతుంది. అప్పటి వరకూ నిర్మాణాలు ప్రారంభించడం కష్టమే.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading