gadar2 star sunny deol court issue
Telecast Date: 20-08-2023 Category: Entertainment Publisher:  SevenTV

 

ఒకపక్క తన సినిమా కేవలం తొమ్మిది రోజుల్లో మూడు వందల కోట్ల వసూళ్లు దాటేసిన ఆనందంలో అభిమానులు ఉంటే గదర్ 2 హీరో సన్నీడియోల్ మాత్రం అప్పుల వల్ల ఒక ఆస్తిని ఏకంగా వేలం వరకు తెచ్చుకున్నట్టు ముంబై రిపోర్ట్. బ్యాంక్ అఫ్ బరోడా తాజాగా టైమ్స్ అఫ్ ఇండియా పత్రికలో ఒక ప్రకటన ఇచ్చింది. దాని ప్రకారం ముంబై ఖరీదైన జుహూ ప్రాంతంలో ఉన్న ఇతని స్వంత ప్రాపర్టీ సన్నీ విల్లాని ఆన్ లైన్ ఆక్షన్ ద్వారా వేలం వేయబోతున్నట్టు, దానికి కారణంగా బాకీలు చెల్లించకపోవడాన్ని పేర్కొంది. ఆ మొత్తం వడ్డీతో కలిపి 56 కోట్లకు చేరుకున్నట్టు దాని సారాంశం.


ఇది సన్నీ డియోల్ అసలు పేరు అజయ్ సింగ్ డియోల్ మీద జారీ చేశారు. సెప్టెంబర్ 25 వరకు గడువు ఇచ్చారు. ఒకవేళ నిర్ధేశిత కాలంలో కనక ఈయన అప్పు చెల్లించకపోతే వేలంలో సొంతం చేసుకున్న పాటదారుడు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ద్వారా హక్కులు పొందుతాడు. కానీ దీనికి చట్టపరంగా నెలల తరబడి ఒక్కోసారి సంవత్సరాలు టైం పడుతుందట. సన్నీ విల్లాలో ఒక ప్రివ్యూ థియేటర్ తో పాటు రెండు పోస్ట్ ప్రొడక్షన్ సూట్లున్నాయి. ఇది బాలీవుడ్ సర్కిల్స్ లో బాగా పేరున్న స్టూడియో. మీడియా ప్రెస్ షోలు ఇక్కడ చాలా జరుగుతాయి. 80 దశకంలోనే దీన్ని మొదలుపెట్టారు


2016 తన స్వీయ దర్శకత్వంలో తీసిన ఘాయల్ వన్స్ అగైన్ కోసం సన్నీ డియోల్ దీన్ని తాకట్టు పెట్టారట. అయితే అది దారుణంగా డిజాస్టరై తీవ్ర నష్టాలపాలు చేసింది. కట్ చేస్తే బ్యాంక్ కు సకాలంలో చెల్లించలేకపోయాడు. అయితే ఇప్పుడిది సమస్య కాదు. గదర్ 2 దెబ్బకు దర్శక నిర్మాతలు సన్నీ డియోల్ వెనుక క్యూ కడుతున్నారు. పైగా ఇదొక్కటే తనకు ఆస్తి కాదు కాబట్టి ఏదో రకంగా సెటిల్ చేసుకోవడం ఖాయం. స్టార్ హీరోలు సర్వ సుఖాల్లో తేలిపోతారనుకుంటాం కానీ ఒక్క డిజాస్టర్ ఏకంగా న్యూస్ పేపర్లలో అప్పుల గురించి ప్రకటనలు ఇచ్చే స్టేజికి తీసుకొస్తుంది. అందుకే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading