fearing defeat kcr action over loan waiver
Telecast Date: 03-08-2023 Category: Political Publisher:  SevenTV

 

కేసీయార్లో భయం మొదలైనట్లే ఉంది. లేకపోతే సంవత్సరాల తరబడి పట్టించుకోని రైతు రుణమాఫీ హామీని అమలు చేయాలని ఉన్నతాధికారులను సడన్ గా ఆదేశించటం ఏమిటి ? నాలుగేళ్ళ నుండి పట్టించుకోని రుణమాఫీని ఇపుడు స్పీడుగా అమలు చేయాలని కేసీయార్ ఆదేశించారు. దశలవారీగా రు. 17 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమచేయాలని ఆదేశించారు. అది కూడా వచ్చేనెల 2వ వారానికల్లా రుణమాఫీ అమలైపోవాలని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. ఆరు నూరైనా రైతు సంక్షేమమే తనకు టాప్ ప్రయారిటి అంటున్నారు కేసీయార్.

ఇంతలోనే ఇంత మార్పు ఎందుకు వచ్చింది ? ఎందుకంటే మూడు కారణాలున్నాయి. మొదటిదేమో రాబోయే ఎన్నికల్లో రైతుల ఓట్లు వేయించుకోవటం. రెండో కారణం ఏమిటంటే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలకు సమాధానం చెప్పుకోవాల్సి రావటం. ఇక మూడో కారణం ఏమిటంటే ఇప్పటికే ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు రైతు వ్యతిరేకి ముద్ర వేసేయటం. కేసీయార్ హామీని అమలుచేయకపోవటంతో రైతాంగం బాగా మండిపోతున్నారు. రుణమాఫీ అవక, బ్యాంకులు కొత్త అప్పులు ఇవ్వకపోవటంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

రుణమాఫీ చేయాలంటే రు. 27 వేల కోట్లు అవసరమని 2018లోనే ప్రభుత్వం లెక్కలు గట్టింది. నాలుగేళ్ళల్లో విడతలవారీగా చెల్లిస్తామని అసెంబ్లీలో ప్రకటించిన కేసీయార్ తర్వాత పట్టించుకోలేదు. మొత్తం మీద ఇప్పటివరకు సుమారు రు. 1207 కోట్లు మాత్రమే కేటాయించారు. ప్రతి ఏడాది బడ్జెట్లో కేటాయింపులు చూపుతున్నారు కానీ వాస్తవంగా నిధులు నిధులు మంజూరు చేయటం లేదు. దాంతో రుణమాఫీ పథకం అటకెక్కిందనే అనుకున్నారు.

అయితే రాబోయే ఎన్నికల్లో రైతుల ఓట్లు, ప్రతిపక్షాల ఒత్తిళ్ళు, అసెంబ్లీ సమావేశాలు అన్నీ కలిపి కేసీయార్లో భయం పెంచేశాయి. అందుకనే సడెన్ గా రుణమాఫీకి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. ఇపుడు రు. 19 వేల కోట్లు మాఫీ చేస్తారు బాగానే ఉంది మరి మిగిలిన సుమారు రు. 6 వేల కోట్ల మాఫీ ఎప్పడున్నదే ప్రశ్నగా మిగిలిపోయింది. కేసీఆర్ వైఖరి చూస్తుంటే ఎలాగుందంటే ఏదైనా తప్పని పరిస్ధితులు ఎదురైనపుడు మాత్రమే ఇచ్చిన హామీలను అమలుచేస్తారని అర్ధమవుతోంది. లేకపోతే హామీలన్నీ గాలికే.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading