devara movie update
Telecast Date: 24-01-2024 Category: Political Publisher:  SevenTV

ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్లో 'దేవర' సినిమా రూపొందుతోంది. కల్యాణ్ రామ్ ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా, చకచకా షూటింగు జరుపుకుంటోంది. అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాతో, కథానాయికగా జాన్వీ కపూర్ పలకరించనుంది. ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఆ తేదీకి థియేటర్లకు వచ్చే అవకాశం లేదనే ఒక టాక్ వినిపిస్తోంది. ఇంకా కీలకమైన .. భారీ సన్నివేశాల చిత్రీకరణ మిగిలే ఉండటం వలన, పాటలను కూడా చిత్రీకరించవలసి ఉన్నందున ఆ సమయానికి రిలీజ్ చేయడం కష్టమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను జూన్ లో గానీ .. ఆగస్టు 15వ తేదీనగాని విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టుగా ఒక టాక్ నడుస్తోంది. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి. సముద్రతీర ప్రాంతంలో నడిచే ఈ కథలో, సైఫ్ అలీఖాన్ .. ప్రకాశ్ రాజ్ .. శ్రీకాంత్ ముఖ్యమైన పాత్రలను పోషించారు.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading