chiru upcoming movies update
Telecast Date: 21-08-2023 Category: Entertainment Publisher:  SevenTV

 

 

చిరంజీవి ఒకేసారి 'ఆచార్య' .. 'గాడ్ ఫాదర్' .. ' భోళాశంకర్' ప్రాజెక్టులను లైన్లో పెట్టి, ఆ తరువాత వాటిని ఒక్కోక్కటిగా థియేటర్స్ కి తీసుకుని వచ్చారు. ఈ మూడింటిలో ఒక సినిమా మాత్రమే ఆడియన్స్ కి కనెక్ట్ కాగలిగింది. ఇప్పుడు మళ్లీ ఆయన మరో మూడు ప్రాజెక్టులను సెట్ చేస్తున్నట్టుగా ఒక టాక్ బలంగా వినిపిస్తోంది.

'బింబిసార' దర్శకుడు శ్రీవశిష్ఠ చిరంజీవితో ఒక ఫాంటసీ మూవీని ప్లాన్ చేస్తున్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఇక కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయనున్నట్టుగా కూడా వినిపిస్తోంది. రేపు చిరంజీవి బర్త్ డే  సందర్భంగా, రేపు ఈ రెండు సినిమాలకి సంబంధించిన ప్రకటన వెలువడనుందని అంటున్నారు.

ఇద్దరు యువ దర్శకులకు చిరంజీవి ఒకే సమయంలో ఛాన్స్ ఇవ్వడం నిజంగా విశేషమే. కంటెంట్ పరంగా ఈ సినిమాలు విభిన్నమైనవి .. ప్రయోగంతో కూడుకున్నవి కావడం విశేషం. ఇక మూడో ప్రాజెక్టును మురుగదాస్ తో చిరంజీవి చేయనున్నాడని చెబుతున్నారు. అయితే అందుకు ఇంకా సమయం ఉందని అంటున్నారు.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading