chiranjeevi wishes to writer satyanand for completing 50 years
Telecast Date: 05-10-2023 Category: Lifestyle Publisher:  SevenTV

 

టాలీవుడ్ లో సీనియర్ రైటర్ అయిన సత్యానంద్ ను అభినందిస్తూ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు. తనకు అత్యంత ఆప్తుడు, ఎన్నో విజయవంతమైన సినిమాలకు స్క్రిప్ట్ సమకూర్చిన సత్యానంద్.. సినిమా రంగంలో 50 వసంతాలు పూర్తిచేసుకున్నారని చెప్పారు. ఈ యాభై ఏళ్ల ప్రస్థానంలో పదునైన డైలాగ్స్ రాసి, నేటి రచయితలకు, దర్శకులకు, నటులకు ఒక మెంటర్ గా వ్యవహరిస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయనకు హృదయ పూర్వక ఆత్మీయ శుభాకాంక్షలు.. అంటూ చిరంజీవి ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. చిరంజీవి సినీ జీవితంలో సత్యానంద్ పాత్ర కూడా ఉంది. ఈ క్రమంలోనే సత్యానంద్ కు శుభాకాంక్షలు తెలుపుతూ.. మరో 50 ఏళ్లు ఇదే ఎనర్జీతో ఉండాలని కోరుకుంటున్నానంటూ చిరంజీవి పేర్కొన్నారు.

 

ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్, మహేష్ బాబు తదితర పెద్ద హీరోల సినిమాలకు సత్యానంద్ రైటర్ గా పనిచేశారు. ఇన్నేళ్లలో ఆయన 400 లకు పైగా సినిమాలకు పనిచేశారు. కొండవీటి సింహం, యముడికి మొగుడు, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు, అంజి, టక్కరి దొంగ.. వంటి సినిమాలకు సత్యానంద్ కథను సమకూర్చారు. ఇటీవల కాలంలో వచ్చిన నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయనా’, రవిబాబు ‘ఆవిరి’ సినిమాలకు స్క్రీన్ ప్లే అందించారు.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading