chinna press meet
Telecast Date: 04-10-2023 Category: Entertainment Publisher:  SevenTV

 

సిద్ధార్థ్ కి తెలుగు .. తమిళ భాషల్లో క్రేజ్ ఉంది. కథ .. స్క్రీన్ ప్లే పై ఆయనకి మంచి అవగాహన ఉంది. సిద్ధార్థ్ కి అవకాశాలు తగ్గి చాలాకాలమే అయింది. అప్పటి నుంచి అడపా దడపా తన సొంత బ్యానర్లో సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. అలా ఆయన నుంచి ఇప్పుడు 'చిన్నా' సినిమా రానుంది. ఈ నెల 6వ తేదీన విడుదలవుతున్న ఈ సినిమా, ఆల్రెడీ సెప్టెంబర్ 28న తమిళంలో 'చిత్తా' టైటిల్ తో విడుదలై అక్కడ మంచి టాక్ తెచ్చుకుంది.

 

ఈ సినిమా తెలుగు వెర్షన్ కి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సిద్ధార్థ్ మాట్లాడాడు. "సెప్టెంబర్ 28న 'సలార్' వస్తుందని తెలిసినప్పుడే, నేను నా సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధపడ్డాను. కానీ ఆ తరువాత వాళ్లు రిలీజ్ డేట్ మార్చుకున్నారు .. ఆ డేట్ కి పది సినిమాలు వచ్చి చేరాయి. నేను హీరోగా ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు దాటిపోయాయి గనుక పెద్దగా టెన్షన్ పడలేదు" అని అన్నాడు. 



'చిన్నా' సినిమాలో నేను హీరో మాత్రమే కాదు .. ఈ సినిమాకి నేను నిర్మాతను కూడా. సౌత్ లో పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్లు నా సినిమాను కొన్నారు. కానీ 'సిద్ధార్థ్ సినిమాను ఎవరు చూస్తారు?' అనే మాట నాకు తెలుగు నుంచి ఎదురైంది..' అంటూ ఆయన ఉద్వేగానికి లోనయ్యాడు. 'నేను తీసింది మంచి సినిమా అయితే, ప్రేక్షకులు నా సినిమాను చూస్తారు' అని ఆ పర్సన్ కి చెప్పాను" అని అన్నాడు. ఇంతకంటే మంచి సినిమాను నేను తీయలేను. ఈ సినిమా చూడండి .. ఆ తరువాత కూడా నా సినిమాలు చూడాలని లేదంటే, నేను ఇక ఇటు వైపు రావడం మానేస్తాను" అని చెప్పాడు.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading