brs mla from bhadrachalam meets revanth reddy triggers talk of defection
Telecast Date: 04-12-2023 Category: Political Publisher:  SevenTV

 

 

తెలంగాణ ఎన్నికల్లో ఊహించని ఓటమి చవిచూసిన బీఆర్ఎస్‌ను వీడేందుకు పలువురు పార్టీ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారన్న వార్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు విడుదలైన కొన్ని గంటలకే భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిశారు. ఆ సమయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అక్కడే ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు తమతో టచ్‌లో ఉన్నారని, ఫలితాలు వచ్చాక కాంగ్రెస్‌లో చేరతామని చెబుతున్నారని ఇటీవల సీనియర్ నేత రేణుకా చౌదరి సహా కొందరు హస్తం పార్టీ నేతలు పేర్కొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తెల్లం వెంకట్రావ్‌తో పాటూ మరో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం పార్టీతో టచ్‌లో ఉన్నారన్న వార్త చర్చనీయాంశంగా మారింది.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading