bigg boss fame manas marriage
Telecast Date: 23-11-2023 Category: Entertainment Publisher:  SevenTV

 

 

 

బిగ్ బాస్ ఫేమ్, బుల్లితెర నటుడు మానస్ వివాహం నిన్న రాత్రి ఘనంగా జరిగింది. విజయవాడలోని మురళీ రిసార్ట్స్ వేదికగా పెళ్లి వేడుక జరిగింది. చెన్నైకు చెందిన శ్రీజను ఆయన పెళ్లాడారు. వివాహ వేడుకకు ఇరు కుటుంబసభ్యులతో పాటు సినీ, టెలివిజన్ రంగాలకు చెందిన పలువురు హాజరయ్యారు. వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలు తెలుగు సీరియల్స్ లో మానస్ నటించారు. బిగ్ బాస్ సీజన్ 5 ఫైనలిస్ట్ అయిన మానస్... తన ఆటతో ప్రేక్షకులను అలరించారు. ఓంకార్ తెరకెక్కించిన 'మ్యాన్షన్ 24' సిరీస్ లో కూడా మానస్ నటించారు. మరోవైపు, కొత్త జంటకు అభిమానులు, నెటిజెన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading