
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ల కలయికలో యువ దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించిన లేటెస్ట్ లవ్, ఎమోషనల్ స్టోరీ మూవీ బేబీ. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఇటీవల రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సొంతం చేసుకుంది. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కె ఎన్ నిర్మించిన ఈ సినిమాకి విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు.
ఇప్పటికే బేబీ మూవీ రూ. 70 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టిన బేబీ మూవీ ఆగష్టు 18న ప్రముఖ ఓటిటి మాధ్యమం ఆహాలో ప్రసారం కానుంది అంటూ తాజాగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే వీటి పై స్పందించిన నిర్మాత ఎస్ కె ఎన్ మాట్లాడుతూ, తమ సినిమా ఓటిటి లో అందుబాటులో ఉండడం లేదని అన్నారు. కాగా ఇది అద్భుతమైన నిర్ణయం అని, అలానే ఇది ప్రేక్షకులను థియేటర్లలో సినిమా చూసేలా ప్రోత్సహించడం తో పాటు చిత్ర రంగానికి సహాయం చేస్తుందని అంటున్నారు సినీ విశ్లేషకులు.
|