
అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, ఘర్షణ సినిమాల ఫేమ్ అసిన్ గుర్తుండే ఉంటుంది. నటించింది తక్కువ సినిమాల్లోనే అయినా తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాలను గెలిచిన ఈ నటి, వివాహం తర్వాత సినిమాలకు దూరమైంది. మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడైన రాహుల్ శర్మను అసిన్ 2016లో వివాహం చేసుకోగా, వీరికి అరిన్ అనే కుమార్తె ఉంది. కుమార్తె ఆరో పుట్టిన రోజు వేడుకను చాలా సాదాసీదాగా జుపుకోవడాన్ని గమనించొచ్చు. తన కుమార్తె పుట్టిన రోజు ఫొటోని అసిన్ సామాజిక మాధ్యమం ఇన్ స్టా గ్రామ్ లో పంచుకుంది.
ప్యారిస్ లోని ఓ హోటల్ లో టేబుల్ పై ఒక క్యాండిల్ వెలిగించి, సింపుల్ గా బర్త్ డే వేడుక నిర్వహించారు ఈ ఫొటోని అసిన్ షేర్ చేసింది. పుట్టిన రోజు (అక్టోబర్ 24) సందర్భంగా అరిన్ ను తాను తన భర్త ప్యారిస్ తీసుకెళ్లినట్టు అసిన్ ప్రకటించింది. అసిన్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండదు. ఎప్పుడో ఒకసారి కానీ ప్రేక్షకులను పలకరించదు. తండ్రి భుజంపై వాలి లైటింగ్ తో వెలిగిపోతున్న ఈఫిల్ టవర్ ను అరిన్ చూస్తున్న వీడియో క్లిప్ ను సైతం అసిన్ పంచుకుంది. అసిన్ చివరిగా 2015లో ఆల్ ఈజ్ వెల్ సినిమాలో కనిపించింది. 2016లో వివాహం తర్వాత నుంచి సినిమాలకు దూరంగా ఉంటోంది. తాను మళ్లీ నటించే అవకాశాలు కూడా లేవని ఆమె చెప్పడం గమనార్హం.
|