anirudh ravichabdar full busy with multiple projects
Telecast Date: 15-08-2023 Category: Entertainment Publisher:  SevenTV

 

ఇండియాలోనే మోస్ట్ బిజీ అండ్ వాంటెడ్ సంగీత దర్శకుడు ఎవరయ్యా అంటే వినిపిస్తున్న పేరు అనిరుద్ రవిచందర్. గత ఏడాది విక్రమ్, ఈ సంవత్సరం జైలర్ రూపంలో కోలీవుడ్ సీనియర్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ లకు అల్టిమేట్ బ్లాక్ బస్టర్స్ దక్కడంలో కీలక పాత్ర పోషించిన ఈ యువ తరంగం డిమాండ్ మాములుగా లేదు. రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నాడనేది అఫీషియల్ గా బయటికి రావడం లేదు కానీ అక్షరాలా 10 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్టు చెన్నై టాక్. ఏఆర్ రెహమాన్ ఫీజు 8 కోట్ల లోపే ఉండగా అవుట్ ఫుట్ పరంగా పోటీనిచ్చే రేంజ్ లో పాటలు చేయడం లేదన్నది తెలిసిందే .


సరే అయితే అయ్యిందని అంత ఇవ్వడానికి ప్రొడ్యూసర్లు సిద్ధపడుతున్నా అనిరుద్ డేట్లు ఖాళీ లేవట. తాను ఎప్పుడు ట్యూన్లు ఇస్తే అప్పుడు తీసుకోవడానికి రెడీ అంటే అగ్రిమెంట్ చేసుకుందామని, లేదూ ఫలానా టైం లోపలే కావాలని ఒత్తిడి చేస్తే ఏ ప్రాజెక్టు వద్దని నిర్మొహమాటంగా చెబుతున్నట్టు వినికిడి. ముఖ్యంగా ఇతర బాషల నుంచి వచ్చినవాళ్ళకు ఈ విషయాన్ని ఖరాఖండిగా చెబుతున్నట్టు తెలిసింది. తొలి ప్రాధాన్యం తమిళ సినిమాలే అయినప్పటికీ జవాన్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనిరుద్ అక్కడా తన ముద్ర బలంగా వేసేందుకు కంకణం కట్టుకున్నాడు.


లక్కీగా జూనియర్ ఎన్టీఆర్ దేవర, విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి సినిమాలకు అనిరుద్ ముందే ఒప్పుకోవడంతో ఈ ఇద్దరు హీరోల అభిమానుల ఆనందం మాములుగా లేదు . ఒకప్పుడు అజ్ఞాతవాసి, గ్యాంగ్ లీడర్, జెర్సి లాంటి ఆల్బమ్స్ చేసినప్పటికీ ఆశించిన అవుట్ ఫుట్ ఇవ్వలేకపోయినా అనిరుద్ కసి ఇప్పుడు వేరే లెవెల్ లో ఉంది. తను ఉన్నాడంటే చాలు ఆడియో కంపెనీలు ఫ్యాన్సీ ఆఫర్లు ఇచ్చి హక్కులు సొంతం చేసుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఇంత భీభత్సమైన ట్రాక్ రికార్డు  దక్షిణాదిలోనే కాదు హిందీతో సహా ఏ వుడ్డులోనూ ఏ సంగీత దర్శకుడికి లేదన్నది అక్షర సత్యం.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading