Zero shadow day leaves people in hyderabad amazed
Telecast Date: 04-08-2023 Category: Technology Publisher:  SevenTV

 

జీరో షాడో డే పేరుతో అక్కడక్కడా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం ఇటీవల తరచూ కనిపిస్తోంది. ఇప్పుడు హైదరాబాద్ లోనూ ఈ దృశ్యం కనిపించింది. గురువారం జీరో షాడో డే పేరుతో ఎండలో నించుని, అందులోని వింతను ప్రజలు కళ్లారా చూశారు. సాధారణంగా సూర్యుడి నడినెత్తిన ఉన్న సమయంలో ఎండలో నించుంటే మన నీడ నేలపై కనిపించకపోవడాన్ని గమనించొచ్చు. ఇలా నీడ పడకపోవడాన్ని జీరో షాడోగా చెబుతారు. సూర్యుడు ఆకాశంలో మధ్య భాగంలోకి చేరినప్పుడు ఇది సాధ్యపడుతుంది.

        ఈ దృశ్యం తరచుగా ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తూనే ఉంటుంది. ఈ నెల 3వ తేదీ మధ్యాహ్నం 12.23 గంటలకు హైదరాబాద్ లోనూ జీరో షాడో దృశ్యాలు కనిపించాయి. సూర్యుడి చుట్టూ పరిభ్రమించే క్రమంలో భూమి అక్షాంశం ఈ పరిణామానికి దారితీస్తుంది. ప్రజలు ఒకరికొకరు చేతులు కలిపి వృత్తాకారంలో నించుని ఫొటోలు తీసుకోవడమే కాకుండా, వాటిని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం కనిపించింది. 

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading