Why are you afraid of Kadems name
Telecast Date: 27-07-2023 Category: Political Publisher:  SevenTV

 

 

తెలంగాణలోని నిర్మల్‌ జిల్లాలోని కడెం ప్రాజెక్టు రెండేళ్లుగా పరీవాహక ప్రాంత ప్రజలను భయపెడుతోంది. భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టు చరిత్రలోనే కనీ విని ఎరుగని రీతిలో వరద వస్తోంది. మరోవైపు ప్రాజెక్టు నిర్వహణను పాలకులు గాలికి వదిలేశారు. అధికారులు మెయింటనెన్స్‌ను పట్టించుకోవడం లేదు. తూతూ మంత్రంగా నిర్వహణ పనుల కారణంగా ప్రాజెక్టు మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. స్వయంగా తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దేవుడే ప్రాజెక్టును కాపాడాలని అనడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. దీంతో పరీవాహక ప్రాంత ప్రజలు ఎప్పుడు వరదొచ్చి మీద పడుతుందో అని జంకుతున్నారు.డేంజర్లో ఉంది. గతేడాది చరిత్రలో తొలిసారిగా కడెం ప్రాజెక్టుకు 6 లక్షల క్యూసెక్కుల భారీగా వరద నీరు వచ్చింది. వరద ధాటికి కడెం ప్రాజెక్టు ఉంటుందా.. కూలుతుందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. గేట్‌ కౌంటర్‌ వెయిట్‌లు కొట్టుకుపోయాయి. సరిగా ఏడాది తర్వాత మళ్లీ అదే పరిస్థితి నెలకొంది. ప్రాజెక్టు కెపాసిటీకి మించి వరద రావడంతో ప్రాజెక్టుపై నుంచి వరద గ్రరూపంలో ప్రవహిస్తోంది.ఎగువన కురుస్తోన్న వర్షాలతో కడెం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది.. గేట్ల పై నుంచి వరద పారుతోంది. ఎగువన నుంచి 3.87 లక్షల క్యూసెక్కుల కు పైగా వరద ప్రాజెక్ట్‌ లోకి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి.. దిగువకు 2.47 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు అధికారులు. అయితే మరో 4 గేట్లు మొరాయించాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. కడెం ప్రాజెక్టు వరద ప్రవాహానికి మంచిర్యాల –నిర్మల్‌ రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతి కారణంగా ప్రాజెక్ట్‌ దగ్గరకు పర్యాటకులను అనుమతించడంలేదు. ప్రాజెక్ట్‌ కు వరద ప్రవాహం కొనసాగుతుండడంతో లోతట్టు ప్రాంతాల్లోని పబ్లిక్‌ లో టెన్షన్‌∙నెలకొంది.గతేడాది రెండు గేట్లు మొరాయించాయి. ఇక ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి 3 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. మరోవైపు నాలుగు గేట్లు తెరుచుకోవడం లేదు. మ్యాన్‌వల్‌గా ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. వారం క్రితం లక్ష క్యూసెక్కులకుపైగా వరద రావడంతో నాలుగు గేట్లు తెరుచుకోలేదు. దీంతో స్థానిక యువకులు వచ్చి సాయం చేశారు. మ్యాన్యువల్‌గా లిప్ట్‌ చేశారు. తాజాగా మరో నాలుగు గేట్లు పనిచేయడం లేదు. మరోవైపు ఎగువ నుంచి ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తోంది. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది.కడెం ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారం తెలుసుకున్న మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రాజెక్ట్‌ దగ్గరకు చేరుకొని ఇరిగేషన్‌ అధికారులతో వరద పరిస్థితిని సమీక్షించారు. ఎగువ నుంచి వరద ఉధృతి పెరుగుతుండటం, గేట్లు పైకి లేవకపోవటంపై మంత్రి స్పందించారు. ఇక ప్రాజెక్ట్‌ ను ఎల్లమ్మ తల్లే కాపాడాలన్నారు. ప్రాజెక్ట్‌ పరీవాహక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు చెప్పారు. తెరుచుకోని గేట్ల మరమ్మత్తుల కోసం ఎక్స్‌పర్ట్స్‌ను రప్పిస్తామన్నారు. అయితే అధికారుల నిర్లక్ష్యం వల్లే కడెం ప్రాజెక్టు గేట్లు మొరాయించాయంటున్నారు గ్రామస్తులు.

 
 Search
Title: 
Category:   

Comments (1) -


July 27. 2023 15:14

sam

good content

sam

Add comment




  • Comment
  • Preview
Loading