
ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ వంటి సిటీయే మునిగిపోయిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధిపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఒకసారి ఆయన విజయనగరం వచ్చి అభివృద్ధి అంటే ఏమిటో చూడాలని సూచించారు. కుప్పం కంటే మా జిల్లా ఎంతో బాగుంటుందన్నారు.
వర్షాల నేపథ్యంలో ముంపుపై విపక్షాలు విమర్శించడం మీదా బొత్స స్పందించారు. వర్షాలకు హైదరాబాదే మునిగిపోయిందని గుర్తు చేశారు. ప్రత్యేక సందర్భాలలో వచ్చే వర్షాలకు మునగడం సహజమన్నారు. అమ్మఒడి కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు రావడంపై వచ్చిన విమర్శల పైనా స్పందించారు. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు రావడంలో తప్పు లేదని, వారు రాకుంటే ఏమైనా సినిమా యాక్టర్లు వస్తారా? అని ఎద్దేవా చేశారు.
|