Dil raju wins as tfcc president
Telecast Date: 31-07-2023 Category: Entertainment Publisher:  SevenTV

 

తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్ సీసీ) నూతన అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎన్నికయ్యారు. ఓట్ల లెక్కింపు ముగిసిన అనంతరం ఫలితాలు వెల్లడించారు. 

ఇవాళ జరిగిన పోలింగ్ లో దిల్ రాజు తన ప్రత్యర్థి, సీనియర్ నిర్మాత సి.కల్యాణ్ పై విజయం సాధించారు. దిల్ రాజు 31 ఓట్లతో గెలుపొందారు. టీఎఫ్ సీసీలో కీలక పోస్టులను దిల్ రాజు ప్యానెల్ కైవసం చేసుకుంది. 

ఫిల్మ్ చాంబర్ ఉపాధ్యక్షుడిగా ముత్యాల రామరాజు ఎన్నికయ్యారు. కార్యదర్శిగా దామోదర ప్రసాద్ విజయం సాధించారు. టీఎఫ్ సీసీ కోశాధికారిగా ప్రసన్నకుమార్ ఎన్నికయ్యారు. 

మొత్తం ఓట్లు 48... మ్యాజిక్ ఫిగర్ 25 కాగా, దిల్ రాజు కు 31 ఓట్లు లభించాయి. తన విజయంపై దిల్ రాజు స్పందించారు. నన్ను గెలిపించిన నిర్మాతలందరికీ కృతజ్ఞతలు... రేపటి నుంచే యాక్షన్ లో దిగుతాం అని వెల్లడించారు.

 
 Search
Title: 
Category:   

Comments () -


Add comment




  • Comment
  • Preview
Loading